Header Banner

Real estate: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం.. కీలక ప్రణాళికలు సిద్ధం, కొన్ని మండలాల్లో!

  Tue Jun 17, 2025 16:18        Politics

హైదరాబాద్ పరిసరాల్లో వసతిచ‌ పరిశ్రమల స్థాపనకు అనువైన భూములకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్యనున్న ప్రాంతాలు అభివృద్ధి దశలో ఉండటంతో, ఇక్కడ భూములకు ఆసక్తి పెరిగింది. దీనివల్ల భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను ఆదాయ వనరుగా మార్చుకోవాలని భావిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు శాఖలు కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కొంతమేర భూమి ధరలు ఇప్పటికే పెరిగిన ప్రాంతాలను గుర్తించి, అక్కడ మార్కెట్ విలువను రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌లుగా మారిన మండలాలపై దృష్టి పెట్టారు.

 

ఇది కూడా చదవండి: Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

సర్కార్ ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ, ఫార్మా హబ్‌లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, యువ భారత్ స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలు వంటి ప్రాజెక్టుల ప్రకటనలతో ఈ ప్రాంతాల్లో భూముల విలువ క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, వేలాది ఉద్యోగావకాశాలు, వాణిజ్య అవకాశాలు రావడం వల్ల భూములపై ఆదాయం దృష్టిలో పెట్టుకొని పెట్టుబడిదారులు, డెవలపర్లు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ORR, RRR మధ్య భూముల ధరలు ప్రభుత్వంగా నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారం చాలా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మార్కెట్ రేట్లను పెంచాలనే నిర్ణయానికి వస్తోంది. ఇది ఒక్క ప్రభుత్వ ఆదాయాన్ని మాత్రమే కాకుండా, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పారదర్శకతను కూడా పెంచుతుంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలు త్వరలో సీఎం కార్యాలయానికి పంపించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొత్త రేట్ల వివరాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత, స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి వస్తాయి. కొన్ని కీలక మండలాల్లో మార్కెట్ విలువ “అసాధారణ స్థాయిలో” పెరగనుందని సమాచారం. ఈ మార్పులతో పాటు, భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మరింత ఊపొచ్చే అవకాశముంది.

 

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #Real estate #Telangana #ORR #RRR #Land Prices #Rise #ViralNews #Hyderabad News #Boom Expected